Advertisement

భారీ వర్షాలు రాబోతున్నాయి జాగ్రత్త: కేసీఆర్

Posted : October 12, 2020 at 2:01 pm IST by ManaTeluguMovies

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురియబోతున్నట్లుగా వాతావరణ కేంద్రం తెలియజేసింది. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్ లను మరియు సీఎస్‌ ను ముందస్తుగా హెచ్చరించారు. ప్రతి జిల్లాలో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలంటూ సూచించారు.

జిల్లాల్లోని కలెక్టర్లు మరియు రెవిన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి వారు అక్కడే ఉండి సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాలంటూ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం కేసీఆర్‌ కోరారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ సీఎం సూచించారు.

భారీ వీదురు గాలులు వీచే అవకాశం ఉందని కనుక చెట్లు విరిగే అవకాశం ఉంది. ఎక్కడ ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని, విద్యుత్‌ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు మూడు రోజులు అప్రమత్తతో వ్యవహరించాలని సెలవులు అన్ని రద్దు చేసుకుని విధుల్లో ఉండాలంటూ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ రెండు రోజులు చాలా కీలకం అంటూ కలెక్టర్ లతో సీఎం అన్నారు. ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు.


Advertisement

Recent Random Post:

పవన్ కల్యాణ్ హోంమంత్రి ఐతే ఏం జరుగుతుంది? | Ambati Rambabu

Posted : November 6, 2024 at 1:19 pm IST by ManaTeluguMovies

పవన్ కల్యాణ్ హోంమంత్రి ఐతే ఏం జరుగుతుంది? | Ambati Rambabu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad