సినీ నటి.. కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ పార్టీని వీడేందుకు సిద్దం అయ్యారు. తమిళనాడులో కాంగ్రెస్ కు కీలక నేతగా ఉన్న కుష్బూ పార్టీ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ విషయమై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. 2010 నుండి రాజకీయాల్లో కొనసాగుతున్న ఈమె మొదట డీఎంకేలో జాయిన్ అయ్యారు. అక్కడ నాలుగేళ్ల పాటు కొనసాగిన ఈమె 2014లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది. అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ పదవులు దక్కినా ఈమెకు ఇతర పదవుల్లో మొండి చేయి చూపించారు.
ఎంపీ సీటు ఆశించగా ఇవ్వలేదు, రాజ్యసభకు పంపిస్తామని సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినా అది నిలుపుకోలేదు. దాంతో ఆమె మనస్థాపంతో చివరకు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అయ్యారు. చాలా కాలంగా ఈమెకు డీఎంకేతో విభేదాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ డీఎంకే కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ఆమె పార్టీలో పొసగలేక పోతుంది. ఈ కారణం వల్ల కూడా ఆమె కాంగ్రెస్ ను వదిలేస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నటిస్తూనే రాజకీయాల్లో కొనసాగుతున్న కుష్బూకు బీజేపీలో ప్రాముఖ్యత దక్కే అవకాశం ఉంది అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేడు జేపీ నడ్డా ఆద్వర్యంలో బీజేపీలో ఆమె జాయిన్ అయ్యే అవకాశం ఉంది.