సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ టైంలో తన పిల్లలైన గౌతమ్ మరియు సితారలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన కొన్ని ఫోటోస్, వీడియోస్ ని నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూనే ఉన్నారు. అలాగే మహేష్ బాబు కూడా అప్పుడప్పుడు కరోనా అవేర్ నెస్ ట్వీట్స్ తో అందరికీ తన సందేశాల్ని పంపారు.
మే 31 కృష్ణగారి బర్త్ డే సందర్భంగా తన తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ మూవీని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానుల ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. అందులో కొన్ని ఆసక్తికరమైన సమాచారం మీకోసం..
మీ పిల్లల కోసం మీరు ఇష్టంగా వాడే వంట – మ్యాగీ నూడిల్స్
మీకు స్ఫూర్తి అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ – నాకు స్ఫూర్తి నాన్నగారే, నా బెస్ట్ ఫ్రెండ్ నమ్రత.
ఎవరంటే ఇష్టం, సమంత లేదా రష్మిక – ఇద్దరూ అద్భుతమైన కో స్టార్. ఇద్దరూ ఇష్టమే.
పూరి తో మళ్ళీ సినిమా ఎప్పుడు – కచ్చితంగా మూవీ చేస్తాను. చెప్పాలంటే ఆయన వచ్చినప్పుడు కథ చెబుతారా అని వేచి చూస్తున్నా.. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆయన ఒకరు.
రాజమౌళితో సినిమా – కచ్చితంగా ఉంటుంది, ఆ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నా.
మీ అందం వెనకున్న సీక్రెట్ – థాంక్స్. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి చాలా కష్టపడతా..
పనిపట్ల అంత పోకస్డ్ గా ఉండటానికి ప్రధాన కారణం – పర్ఫెక్షన్ కోసం ఎక్కువ ఆరాటపడతాను.
జేమ్స్ బాండ్ తరహా సినిమా – నాకు చేయాలని ఉంది, నీదగ్గర స్క్రిప్ట్ ఉంటే చెప్పు.
అందరిలో మహేష్ బాబు అంటే ఎలా గుర్తుండాలనుకుంటారు – ఓ గొప్ప నటుడిగా, పిల్లలకి గొప్ప తండ్రిగా, ఓ మంచి భర్తగా ఉండాలనుకుంటా.
ఇష్టమైన మార్వల్ సూపర్ హీరో – ఐరన్ మాన్ అండ్ హల్క్
ఫ్రీ టైం లో ఎలా సమయం గడుపుతారు – బుక్స్ చదువుతా, సినిమాలు చూస్తాను.. స్విమ్మింగ్ అండ్ పిల్లలతో ఆడుతా. మా డాగ్స్ తో కూడా సమయం గడుపుతా.
గౌతమ్ కూడా హీరో అవుతాడా – వాడికి ఆ ఆలోచన ఉన్నట్టుండి.. చూద్దాం కాలం ఏం చేస్తుందో..
అభిమానుల గురించి – వాళ్ళ ప్రేమవల్లే నేనీ స్థాయిలో ఉన్నా.. వారిని మెప్పించడానికే ప్రయత్నిస్తుంటాను. అందరూ ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి.