రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయన్‌గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రంగస్థలం. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన రంగస్థలం చిత్రం తర్వాత మహేష్‌బాబుతో సుకుమార్ సినిమా అనుకున్నాడు. దాదాపుగా ఏడాది పాటు ఆయనతో ట్రావెల్ చేశాడు. కథలు చెబుతూ స్క్రిప్ట్ చర్చలు జరుపుతూ సుకుమార్ ఏడాది కాలం వృదా చేసుకున్నాడు. చివరకు మహేష్‌బాబుతో సృజనాత్మక విభేదాల కారణంగా ఇద్దరి కాంబో సినిమా క్యాన్సిల్ అయ్యింది.
మహేష్ నో చెప్పడంతో అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చిత్రంను సుకుమార్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. లేదంటే షూటింగ్ స్పీడ్‌గా పూర్తి చేసి ఇదే ఏడాదిలో సినిమాను తీసుకు రావాలని సుకుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనే దర్శకుడు సుకుమార్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రంగస్థలం చిత్రం తర్వాత నేను తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒక భారీ చిత్రాన్ని చేయాలనుకున్నాను. కాని అది వర్కౌట్ కాలేదని అన్నాడు. అంటే మహేష్‌బాబుతో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సినిమా అనుకున్నాడన్నమాట. కాని మహేష్ బాబు మాత్రం ఉద్యమ నేపథ్యంలో సినిమాకు ఆసక్తి చూపించలేదు. దాంతో పుష్ప స్టోరీ చెప్పగా దానికి కూడా తాను సెట్ అవ్వనని భావించిన మహేష్ మరో దర్శకుడితో వెళ్లి పోయాడు. మహేష్ కాదన్న ఆ తెలంగాణ సాయుద పోరాట చిత్రాన్ని సుకుమార్ వదిలేస్తాడా మళ్లీ మరో హీరోతో ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాలి.