Advertisement

అఫిషియల్: ‘విడాకులు తీసుకుంటున్నాం’ నాగచైతన్య- సమంత ప్రకటన

Posted : October 5, 2021 at 11:39 am IST by ManaTeluguMovies

కొద్ది రోజులుగా అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత వివాహ బంధంపై అనేక ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలిసి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. తాము విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తామిద్దరం ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని.. తమ దారులు వేరని.. ఇకపై స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు.

‘‘మా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తల బంధానికి దూరంగా ఉండాలనుకుంటున్నాం. అనేక చర్చలు, ఆలోచనల తర్వాత మేమిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. స్నేహం కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నాం. పదేళ్లుగా కొనసాగిన మా స్నేహం.. వివాహం చేసుకునేందుకు చాలా కీలకంగా మారింది. ఈ కష్ట సమయంలో అభిమానులు, మీడియా సహకారం, సన్నిహితుల మద్దతు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు.

మొత్తంగా అక్కినేని, సమంత అభిమానులను ఈ వార్త నిజంగా బాధించేదే అని చెప్పాలి. 2017 అక్టోబర్ లో వీరు ఎంతో ఆడంబరంగా గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

Andhra Pradesh : కొడాలి నానికి బిగుస్తోన్న కేసుల ఉచ్చు! | YCP Kodali Nani

Posted : November 18, 2024 at 11:59 am IST by ManaTeluguMovies

Andhra Pradesh : కొడాలి నానికి బిగుస్తోన్న కేసుల ఉచ్చు! | YCP Kodali Nani

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad