Advertisement

అతడిని వదల్లేక పోతున్న నాని!

Posted : April 13, 2020 at 10:39 pm IST by ManaTeluguMovies

తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ముందుగా అజ్ఞాతవాసి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. అతనికి వీర ఫాన్ అయిన త్రివిక్రమ్ మళ్ళీ సెంటిమెంట్ కారణాల వల్ల రిపీట్ చేయడం లేదు. కానీ మన హీరో నాని మాత్రం అనిరుధ్ జపం చేస్తున్నాడు.

జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలకి అతడిని ఏరి కోరి పెట్టించుకున్నాడు. గోపి సుందర్ లాంటి సంగీత దర్శకుల కంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిన అనిరుద్ కోసం నాని పట్టుబడుతున్నాడు. త్వరలో చేయబోతున్న సైన్స్ఫిక్షన్ మూవీ అయిన శ్యామ్ సింగ రాయ్ కోసం మళ్ళీ అనిరుధ్ ని అడుగుతున్నారు.

ముందుగా ఏ.ఆర్. రెహమాన్ అనుకున్నారు కానీ అతని వల్ల బడ్జెట్ మరీ పెరిగిపోతోందని అనిరుధ్ తో సరిపెడుతున్నారు. ఈ సినిమా జానర్ కి క్వాలిటీ మ్యూజిక్ ఉండాలని, అల్లాటప్పా మ్యూజిక్ సరిపోదని నాని చెప్పడంతో అనిరుధ్ ఇప్పుడు తమిళంలో పిచ్చ బిజీ ఉన్నా అతడినే సంప్రదిస్తున్నారట.


Advertisement

Recent Random Post:

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Posted : October 3, 2024 at 2:41 pm IST by ManaTeluguMovies

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad