Advertisement

అనుష్క మూవీ విషయంలో యంగ్ హీరో స్పెషల్ కేర్

Posted : April 29, 2022 at 12:21 pm IST by ManaTeluguMovies

తెలుగ సినిమాని ఇప్పడు దేశ వ్యాప్తంగా వున్న ప్రతీ ఒక్కరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. మన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మన హీరోలు కూడా తమ ప్రాజెక్ట్ లపై ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారట. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ‘జతారత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి యువీ క్రియేషన్స్ లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఓ విబిన్నమైన కథతో రూపొందుతున్న ఈ మూవీలో నవీన్ పొలిశెట్టికి జోడీగా అనుష్క నటిస్తోంది. ‘నిశ్శబ్దం’ తరువాత కెమెరా ముందుకు రాని అనుష్క ఎట్టకేలకు మళ్లీ మేకప్ వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో అనుష్క కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారట.

తను మీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ జాతిరత్నాలు కామెడీ ప్రధానంగా సాగినవి. అందులో తన పాత్రకు కామెడీని జోడించిన మలిచిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తాజా చిత్రంలోని తన పాత్ర కూడా అదే పంథాలో సాగాలని భావించిన ననీన్ పొలిశెట్టి కామెడీ విషయంలో కేర్ తీసుకుంటున్నారట.

ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. స్టాండప్ కామెడయన్ గా అందరిని మెప్పించాలని తపన పడే ఓ యువకుడిగా నవీన్ పొలిశెట్టి పాత్ర వుంటుందట. ఆ కారణంగానే కామెడీ గురించి తనపై చిత్రీకరించే సన్నివేశాల గురించి నవీన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు.

నవీన్ స్వతహాగా సెన్సాఫ్ హ్యూమర్ వున్న హీరో. అదే అతనికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ జాతిరత్నాలు చిత్రాల్లో ప్లస్ అయింది. అందుకే అతనిపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అంత సహజంగా వచ్చాయి. దాంతో తాజా చిత్రంలోనూ నవీన్ స్టాండప్ కామెడీ చేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించబోతున్నారట. ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టాండప్ రాహుల్ చిత్రాల్లో స్టాండప్ కామెడీకి ప్రధాన్యత నిచ్చారు. ఈ రెండు చిత్రాల్లో పూజా హెగ్డే రాజ్ తరుణ్ స్టాండప్ కామెడీయన్స్ గా కనిపించారు. కానీ ఈ పాత్రలతో ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో తన తాజా చిత్రంలో స్టాండప్ కామెడీ చేసే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నవీన్ పొలిశెట్టి ఏ స్థాయిలో తన పాత్రని రక్తి కట్టిస్తాడో వేచి చూడాల్సిందే. ఇప్పడి వరకు స్టాండప్ కామెడీయన్స్ గా నటించిన వాళ్లు ఇంపాక్ట్ ని కలిగించలేకపోయారు. తన సినిమాతో స్టాండప్ కామెడీ తెలుగులోనూ సాధ్యమేనని నవీన్ పొలిశెట్టి ఏ స్థాయిలో నిరూపిస్తాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 27th September “2024

Posted : September 27, 2024 at 10:22 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 27th September “2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad