పవన్ కళ్యాణ్ 26వ చిత్రంగా పింక్ రీమేక్ వకీల్ సాబ్ రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. 27వ చిత్రం క్రిష్ దర్శకత్వంలో ప్రారంభించబోతున్న సమయంలో అనూహ్యంగా కరోనా కారణంగా సినిమా ఆరంభం కాకుండానే ఆగిపోయింది. సినిమా లో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే. సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ ను క్రిష్ అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.
పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు బంధిపోటు అనే టైటిల్ ను పెట్టాలంటూ క్రిష్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ టైటిల్ తో ఇప్పటికే అల్లరి నరేష్ సినిమా వచ్చింది కనుక టెక్నికల్ గా సాధ్యం అవుతుందో కాదో. కాని పవన్ ఫ్యాన్స్ మాత్రం చాలా బలంగానే క్రిష్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. మరి వారి విజ్ఞప్తిని క్రిష్ ఏమైనా కన్సిడర్ చేస్తాడా లేదా చూడాలి. ప్రస్తుతంకు క్రిష్ స్క్రిప్ట్ వర్క్ కూడా లేకపోవడంతో వెబ్ సిరీస్ లకు సంబంధించిన ప్లానింగ్ చేస్తున్నాడట.
క్రిష్ దర్శకత్వంలో గతంలో వచ్చిన ఛారిత్రాత్మక చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే అలాంటి చారిత్రాత్మక నేపథ్యం చిత్రంను పవన్ చేసేందుకు సిద్దం అయ్యాడు. మొఘలుల కాలం నాటి కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అయ్యి వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.