Advertisement

#sukanyarapistrahulgandhi.. ఎందుకు ట్రెండ్ అవుతోంది?

Posted : July 9, 2020 at 4:13 pm IST by ManaTeluguMovies

రాహుల్ గాంధీ మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. కానీ అది మంచి కారణంతో కాదు. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. #sukanyarapistrahulgandhi.. ఇదీ ఆ హ్యాష్ ట్యాగ్. రాహుల్ గాంధీ ఏంటి.. రేప్ కేసు ఏంటి అనిపిస్తోందా? ఆయన మీద ఒక రేప్ కేసు ఉన్న మాట వాస్తవం. ఒకప్పుడు ఆ కేసు సంచలనం రేపింది. 13 ఏళ్ల తర్వాత గత ఏడాదే సరైన ఆధారాలు లేవంటూ ఆ కేసును కొట్టేసింది సుప్రీం కోర్టు. 2006లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా ఉత్తర ప్రదేశ్‌లో సుకన్య అనే అమ్మాయిని రాహుల్‌తో పాటు మరో ఏడుగురు కలిసి రేప్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి.

యూపీలో అప్పటికి సోనియా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలోని తన గెస్ట్ హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న రాహుల్.. తనకు అభిమాని అయిన పార్టీ కార్యకర్త బల్‌రామ్ సింగ్ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్నది ఆరోపణ. అందులో ఇద్దరు రాహుల్ స్నేహితులైన బ్రిటిష్ వ్యక్తులు కూడా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఐతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ కేసులో నిజాలు బయటికి రాకుండా చేశారని.. రాహుల్‌తో పాటు అతడి స్నేహితుల్ని బయటపడేశారని.. మీడియా కూడా ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషించిందని ఆరోపణలున్నాయి.

బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు అమేథీ నుంచి ఢిల్లీకి వెళ్లిపోగా.. వాళ్లు తర్వాత ఏమయ్యారు.. ఎక్కడున్నారు అన్న సమాచారం ఎవరి దగ్గరా లేదు. పన్నెండేళ్లకు పాటు ఈ కేసు విచారణ సాగగా.. గత ఏడాది ఆధారాల్లేవంటూ సుప్రీం కోర్టు కేసు కొట్టేసింది. ఐతే తాజాగా ఓ టీవీ చర్చలో భాజపా నేత సంబిత్ స్వరాజ్ ఓ టీవీ చర్చలో రాహుల్ గాంధీ మీద రేప్ కేసు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ గట్టిగా గళం వినిపించాడు. ఈ నేపథ్యంలో పై హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. దీనిపై లక్షల్లో ట్వీట్లు పడ్డాయి. ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోందీ హ్యాష్ ట్యాగ్.


Advertisement

Recent Random Post:

2 States : సరస్వతీ పవర్ భూముల వివాదంలో మరో ట్విస్ట్ | AP Politics

Posted : November 6, 2024 at 12:25 pm IST by ManaTeluguMovies

2 States : సరస్వతీ పవర్ భూముల వివాదంలో మరో ట్విస్ట్ | AP Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad