Advertisement

సూపర్‌ స్టార్స్‌ ఇద్దరు కూడా రియల్‌ మ్యాన్స్‌ కాదన్నట్లేనా?

Posted : April 28, 2020 at 9:33 pm IST by ManaTeluguMovies

సందీప్‌ రెడ్డి నుండి రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి తన ఇంటి పనుల వీడియోను పెట్టి ఎన్టీఆర్‌ చరణ్‌లకు ఆ ఛాలెంజ్‌ను విసిరిన విషయం తెల్సిందే. రాజమౌళి ఛాలెంజ్‌ను స్వీకరించిన చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు ఇద్దరు కూడా రియల్‌ మ్యాన్‌ అనిపించుకున్నారు. ఇక ఎన్టీఆర్‌ నలుగురు సీనియర్‌ స్టార్‌ హీరోలకు ఈ ఛాలెంజ్‌ చేయగా అందులో చిరంజీవి వెంకటేష్‌లు మాత్రమే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి రియల్‌ మ్యాన్‌ అనిపించుకున్నారు. బాలకృష్ణ, నాగార్జునలు పట్టించుకోలేదు.

ఇక చిరంజీవి సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు ఈ ఛాలెంజ్‌ చేశాడు. అలాగే వెంకటేష్‌ తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు ఈ ఛాలెంజ్‌ను చేశాడు. ఈ ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ కూడా ఈ ఛాలెంజ్‌ను లైట్‌ తీసుకున్నారు. సినిమాల్లో సూపర్‌ స్టార్స్‌ గా కీర్తించబడుతున్న వీరిద్దరు నిజ జీవితంలో మాత్రం రియల్‌ మ్యాన్‌ అనిపించుకోలేదు. వీరు రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ను లైట్‌ తీసుకోవడంతో మొత్తం ఛాలెంజ్‌ నీరుగారి పోయింది.

ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌ చేసిన బాలకృష్ణ, నాగార్జునలతో పాటు ఇంకా పలువురు స్టార్స్‌ కూడా ఈ ఛాలెంజ్‌ పై స్పందించేందుకు కనీసం ఆసక్తి చూపించలేదు. దాంతో కొన్ని రోజుల్లోనే బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్‌ గురించి జనాల్లో చర్చ లేకుండా పోయింది. ఈ ఛాలెంజ్‌ మరీ ఇంత స్పీడ్‌ గా కనుమరుగవుతుందని ఎవరు అనుకోలేదు. ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ స్పందించక పోవడం వల్లే ఈ ఛాలెంజ్‌ త్వరగా కనుమరుగయ్యిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించని వారు రియల్‌ మ్యాన్‌ కాదని నెటిజన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

జగన్ కుట్ర పై రేవంత్ రెడ్డి రియాక్షన్ || CM Revanth Reddy reacts to CM Jagan Promise to KCR

Posted : May 7, 2024 at 10:02 pm IST by ManaTeluguMovies

జగన్ కుట్ర పై రేవంత్ రెడ్డి రియాక్షన్ || CM Revanth Reddy reacts to CM Jagan Promise to KCR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement