టాలీవుడ్ పాపులర్ సింగర్స్ లో సునీత ఒకరు. 25 ఏళ్ల క్రితం వచ్చిన అనగనగా ఒక రోజు సినిమాలో హీరోయిన్ ఊర్మిళకు డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. వాయిస్ టెస్ట్ లో రామ్ గోపాల్ వర్మకు సునీత గొంతు నచ్చలేదు. కానీ.. ఆ తర్వాత రోజుల్లో ఎందరో హీరోయిన్లకు సునీత తన గొంతు అరువిచ్చారు. గులాబీలో.. ఈ వేళలో నీవు.. అనే పాటతో పాపులర్ సింగర్ గా కూడా మారిపోయింది. ఇటివలే రెండో పెళ్లి చేసుకున్న సునీత మళ్లీ వార్తల్లో నిలిచారు.
ఈ సందర్భంగా ఆమెకు హీరోయిన్ అవకాశం వచ్చిందా..? వస్తే చేస్తారా అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో తలెత్తింది. దీనికి సునీత చాలా సున్నితమైన సమాధానమే ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న జీవితంలో గతాన్ని మార్చే అవసరం లేదని అన్నారు. ఇప్పుడంతా బాగానే ఉంది.. అని అన్నారు. మొత్తంగా హీరోయిన్లంటే ఉండే టెన్షన్స్ ను ఆమె ఒక్క సమాధానంతో చెప్పాశారని అంటున్నారు. లేని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? అన్నట్టుగా ఆమె సమాధానం ఉంది అని కూడా అంటున్నారు.