Advertisement

నిశ్చితార్థ వార్తలు కొట్టి పారేసిన సురేష్‌బాబు

Posted : May 20, 2020 at 8:46 pm IST by ManaTeluguMovies

ఈ రోజు ఉదయం నుండి కూడా సోషల్‌ మీడియాలో రానా వివాహ నిశిత్చార్థం అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌తో రానా వివాహ నిశ్చితార్థం జరుగబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు కొద్ది మంది సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరగబోతుందని మీడియాలో కూడా వార్తలు రావడంతో సురేష్‌బాబు స్పందించాడు. మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కొట్టి పారేశాడు.

రానా వివాహ నిశ్చితార్థం అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని.. నేడు రెండు కుటుంబాల పెద్దలం కలిసి సాంప్రదాయ బద్దంగా మాట్లాడుకోబోతున్నామని అన్నారు. ఈ రోజు జరుగబోతున్న కార్యక్రమంలో నిశ్చితార్థం మరియు వివాహంకు సంబంధించిన విషయాలపై చర్చించబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెలలో నిశ్చితార్థం జరగడంతో పాటు డిసెంబర్‌ లోపే పెళ్లి కూడా ఉంటుందని సురేష్‌బాబు గతంలోనే చెప్పుకొచ్చాడు.

రానా నిశ్చితార్థ వార్తలు అబద్దమని క్లారిటీ రావడంతో ఆయన ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో నిశ్చితార్థం మరియు పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలో పెళ్లితో ఒక్కటి కాబోతున్నందుకు ఇరు కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

TDP Vs Janasena : జనసేన, టీడీపీ నేతల మధ్య వరుస ఘర్షణలు

Posted : November 1, 2024 at 11:58 am IST by ManaTeluguMovies

TDP Vs Janasena : జనసేన, టీడీపీ నేతల మధ్య వరుస ఘర్షణలు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad