Advertisement

బాయ్స్ లాకర్ రూమ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన తాప్సి

Posted : May 12, 2020 at 12:46 pm IST by ManaTeluguMovies

ఈ రోజుల్లో యువత, మరీ ముఖ్యంగా రేపటి యువత ఎలాంటి పెడుదోవలో వెళుతోందో అన్న భయాందోళనలు ప్రతీ ఒక్కరిలో నెలకొన్నాయి. సమాజం యువత చేతుల్లో ఉంది అంటుంటారు. మరి రేపటి సమాజంలోకి రానున్న 15 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండని పిల్లలు చెప్పుకునే కబుర్లు ఎలా ఉంటున్నాయి. అమ్మాయిల పట్ల అబ్బాయిల దృష్టి కోణం ఎలా ఉంది అన్న దానికి మరింత భయాందోళనలు కలిగించేలా ఉంది ఇటీవలే బయటపడ్డ వార్త.

బాయ్స్ లాకర్ రూమ్ పేరిట ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లో అందరూ 15, 16 వయసు ఉన్న పిల్లలే. ఆ గ్రూప్ లో అమ్మాయిల పట్ల అసభ్యంగా మాట్లాడుకోవడం, వారి ఫోటోలను అశ్లీలంగా తయారుచేసి శునకానందం పొందడం, కుదిరితే వారిని రేప్ చేయాలని మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రేపటి యువత ఎంత దారుణంగా తయారవుతున్నారో అన్న దానికి ఇదే తార్కాణం. ఈ గ్రూప్ లోని చాట్, ఫోటోలు బయటపడిన నేపథ్యంలో అందరూ స్పందిస్తున్నారు. తీవ్రంగా మాట్లాడుతున్నారు. అయితే దీనిపై తాప్సి భిన్నంగా స్పందించింది.

ఇదేమి తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని అంటోంది. అమ్మాయిల గురించి తీవ్రంగా మాట్లాడుకోవడం, వారి బాడీ గురించి కామెంట్లు చేసుకోవడం కొత్తేమి కాదు కదా. ఈరోజు అందరూ ఇంతలా ఎందుకు స్పందిస్తున్నారో అర్ధం కావడం లేదు. అమ్మాయిలను చూసే విధానంలో అబ్బాయిలలో మార్పు వచ్చే వరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని వ్యాఖ్యానించింది.


Advertisement

Recent Random Post:

అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే..! | AP Deputy CM Pawan Kalyan

Posted : November 6, 2024 at 7:40 pm IST by ManaTeluguMovies

అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే..! | AP Deputy CM Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad