Advertisement

ఆదిపురుష్ లో ఊర్వశి రౌతెల ఉందా? లేదా? – ఇదిగో క్లారిటీ.!

Posted : September 30, 2020 at 7:11 pm IST by ManaTeluguMovies

ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ హిందీ తెలుగు ద్విభాష చిత్రం పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆసక్తినెలకొన్న విషయం తెల్సిందే. రామాయన ఇతివృత్తంతో రూపొందబోతున్న ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆదిపురుష్‌ లో ఇప్పటికే రాముడి పాత్రను ప్రభాస్‌ మరియు లంకేష్‌ పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక హీరోయిన్‌ గా సీత పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

కీర్తి సురేష్‌ తో పాటు పలువురి పేర్లు ప్రచారం జరిగాయి. ఇటీవల హిందీ హీరోయిన్‌ ఊర్వశి రౌతేలా ను సీత పాత్రకు ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాదంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు సీత పాత్ర కోసం ఎవరిని ఫైనల్‌ చేయలేదు అన్నారు. ఇదే సమయంలో ఊర్వశితో సంప్రదించినట్లుగా వస్తున్న వార్తలను కూడా కొట్టి పారేశారు. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం రాముడు మరియు రావణుడి పాత్రలను మాత్రమే ఫైనల్‌ చేశారు.

ఇతర కొన్ని పాత్రలకు నటీనటులను ఎంపిక చేసినప్పటికి వారిని ఇప్పుడే అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు. ఇదే సమయంలో సీత పాత్రకు మాత్రం ఇంకా హీరోయిన్‌ ను ఫైనల్‌ చేయలేదని హిందువుల మనో భావాలను పరిగణలోకి తీసుకుని సీత పాత్రను ఎంపిక చేయాల్సి ఉంటుందని మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకే సీత పాత్ర విషయంలో హడావుడి లేకుండా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. కనుక అప్పటి వరకు హీరోయిన్‌ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 7th May 2024

Posted : May 7, 2024 at 10:28 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 7th May 2024\

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement