Advertisement

వకీల్ సాబ్ టీజర్ తో పాటు పవన్ పుట్టినరోజున అది కూడా..

Posted : July 17, 2020 at 3:00 pm IST by ManaTeluguMovies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 అన్న విషయం తెల్సిందే. అయితే ఇప్పటినుండే ఈ డేట్ కు సంబంధించిన హడావిడి మొదలైపోయింది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయిపోయింది కాబట్టి ఆ రోజుకి టీజర్ వదలడం అనేది పెద్ద విషయమేం కాదు.

అయితే ఆరోజు వకీల్ సాబ్ టీజర్ తో పాటు మరో అప్డేట్ కూడా ఉంటుందని సమాచారం. వకీల్ సాబ్ కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. జానపద పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే రివీల్ అయింది. లాక్ డౌన్ కు ముందు రెండు చిన్న షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసాడు క్రిష్.

ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 2న క్రిష్ పవన్ తో చేయబోయే చిత్ర టైటిల్ ను రివీల్ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి మొదట విరూపాక్ష అనే టైటిల్ ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా బందిపోటు, మంచిదొంగ, చోర వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏదైనా టైటిల్ క్రిష్ ఫైనల్ చేస్తాడా? లేదా మరో కొత్త టైటిల్ తో వస్తాడా? అసలు సెప్టెంబర్ 2కి టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందా?


Advertisement

Recent Random Post:

ఆంధ్రనాట సైలెంట్ ఓటింగ్ జరగనుందా.? ఓటర్ మైండ్సెట్ పార్టీలకు పజిల్గా మారిందా.?

Posted : April 22, 2024 at 12:00 pm IST by ManaTeluguMovies

ఆంధ్రనాట సైలెంట్ ఓటింగ్ జరగనుందా.? ఓటర్ మైండ్సెట్ పార్టీలకు పజిల్గా మారిందా.?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement