Advertisement

విక్రమ్ కుమార్ స్టామినాకు ఏమయింది

Posted : July 17, 2020 at 3:22 pm IST by ManaTeluguMovies

13 బి, ఇష్క్, మనం, 24 ఈ సినిమాలు అన్నీ దర్శకుడు విక్రమ్ కే కుమార్ కథావిస్తరణ సామర్థ్యాన్ని, స్క్రీన్ ప్లే టాలెంట్ ను చూపిస్తాయి. చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ లు తీసుకుని, ఎలా చేస్తారు? అని ఎవరైనా అనుకుంటే, ఇదిగో ఇలా అనేట్లుగా సినిమాలు తీసి చూపించారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ఒక సరైన కథ కూడా అల్లలేకపోతున్నారని ఇండస్ట్రీ టాక్.

బన్నీ దగ్గర చిరకాలం వుండి కథ కోసం కసరత్తు చేసి, చేసి ఆఖరికి వదిలేసారు. ఈ క్రమంలో రాజీపడి మరో కథకుడు వక్కంతం వంశీ తో కూడా కలిసి పని చేసారు. అయినా అవుట్ పుట్ రాలేదు. గ్యాంగ్ లీడర్ తరువాత సరైన కథతో సరైన ప్రాజెక్టు ఎక్కిద్దామని తెగ ప్రయత్నించారు. కానీ కథ కుదరలేదు.

ఓ మిడ్ రేంజ్ యంగ్ హీరోతో సినిమా చేయాలని మూడు కథలు చెప్పారట. అన్నింటికి నో అన్నదే ఆన్సర్ అయింది. ఆఖరికి దిల్ రాజు తన దగ్గర వున్న బివిఎస్ రవి కథను అందిస్తే, దాన్ని పట్టుకుని సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అది కూడా ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదని టాక్. నిజానికి వేరే వాళ్ల కథతో సినిమా చేయడం అన్నది విక్రమ్ కుమార్ కు ఇష్టం లేకపోయినా, సినిమాలు చేతిలోకి రాని పొజిషన్ లో తప్పని సరైందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మనం, 24 సినిమాల టైమ్ లో తరువాత సినిమా మహేష్ తోనే అంటూ టాక్ వుండేది. అలాంటి డైరక్టర్ అన్నీ తిరిగి మళ్లీ చైతన్య దగ్గరకు వచ్చేసాడు. అలాంటిది చైతన్య కూడా కథ విషయంలో ఇంకా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఓడలు బళ్లు కావడం అంటే ఇదేనేమో?


Advertisement

Recent Random Post:

Andhra Ranam : విశ్వసనీయత Vs అభూత కల్పన | AP Elections 2024 | AP Manifesto Politics

Posted : April 30, 2024 at 10:36 pm IST by ManaTeluguMovies

Andhra Ranam : విశ్వసనీయత Vs అభూత కల్పన | AP Elections 2024 | AP Manifesto Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement