Advertisement

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: వేణు ఉడుగుల – సాయి పల్లవిపై వచ్చే రూమర్స్ లో నిజమేంటంటే.?

Posted : April 28, 2020 at 5:47 pm IST by ManaTeluguMovies

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన రియలిస్టిక్ సినిమా ‘నీది నాది ఒకే కథ’ ద్వారా తెలుగు సినిమాకి పరిచయమైన యంగ్ డైరెక్టర్ వేణు ఉడుగుల. మొదటి సినిమా సింపుల్ బడ్జెట్ లో చేసిన వేణు రెండవ సినిమానే భారీ బడ్జెట్ తో రానా దగ్గుబాటి హీరోగా పాన్ ఇండియా ఫిల్మ్ గా చేస్తున్నాడు. అదే ‘విరాట పర్వం’. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంటూ తన తదుపరి సినిమా, వెబ్ సీరీస్ కథలతో బిజీగా ఉన్న వేణు ఉడుగులతో ప్రత్యేకంగా మాట్లాడాము.. ఆ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

‘నీది నాది ఒకే కథ’ ఎంతో మంది నిజజీవితంలో పేస్ చేసే ఓ పాయింట్.. ఈ పాయింట్ ని మీ ఫస్ట్ మూవీ కోసం ఎంచుకోవడానికి గల కారణం?

మన విద్యా విధానంలో చాలా తప్పులున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లల్ని మొదటి నుంచి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఒక మెకానిక్ రోబోటిక్ సిస్టంని పిల్లల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ చూసాకా పిల్లలకి వారి బాల్యాన్ని, ఆనందాన్ని మిస్ చేస్తున్నారు. కాంపిటీషన్ లో పడి పక్కన ఉన్న వారిని మనుషుల్నిగా చూడడమే మానేసేలా చేస్తున్నారు. అన్నింటిలో ర్యాంక్స్ తెచ్చుకోవడం, డబ్బు సంపాదించడమే జీవితం అన్నట్టు తయారు చేస్తున్నారు. ఆ పాయింట్ నన్ను చాలా రోజులుగా హాంట్ చేసేది, అందుకే అదే చేసాను.

‘నీది నాది ఒకే కథ’ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి. ఆఫర్ ఇచ్చిన వారితోనే ‘విరాట పర్వం’ చేస్తున్నారా?

చెప్పాలంటే సెన్సార్ నుంచి చాలా మంచి విషయమున్న సినిమా, కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనే టాక్ రావడంతో సినిమాకి రిలీజ్ కి రెండు రోజుల ముందే ఒక ముగ్గురు పెద్ద నిర్మాతల నుంచి అడ్వాన్స్ ఇచ్చారు. 2వ సినిమా 14 రీల్స్ లో చెయ్యాలి, కానీ అనుకోకుండా సుధాకర్ చెరుకూరి గారి చేతికి వెళ్ళింది. సో ఆయనే విరాటపర్వం కథ ఫిక్స్ చేసి పట్టాలెక్కించారు.

మరి రానా హీరో అవ్వడం వలన సురేష్ బాబు గారు మరో నిర్మాతగా జాయిన్ అయ్యారా?

అయ్యో లేదండీ.. అసలు రానా గారిని మేము అనుకోలేదు ఆయనే అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు.. సుధాకర్ గారే ఇంకో ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంటే ఈ స్క్రిప్ట్ కి బాగుంటుందని సురేష్ బాబు గారికి నేరేషన్ ఇవ్వడానికి వెళ్లాం. ఆయనకి ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ నచ్చింది. ఎక్స్ట్రార్డినరీ కథ, మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అవుతుంది అన్నారు. అలా నేరేట్ చేసి వెళ్లిపోతున్న టైంలో రానా గారు వస్తే పరిచయం చేశారు, మేము వెళ్లిపోయాం. దారిలో ఉండగా మళ్ళీ సురేష్ గారు కాల్ చేసి లైన్ రానాకి బాగా నచ్చింది, రేపు వచ్చి నేరేట్ చెయ్యి అన్నారు. నెక్స్ట్ డే వెళ్లడం, నేరేషన్ అవ్వగానే ఈ సినిమా నేను చేస్తున్నాను అని సైన్ చేయడం అంతా కలలా జరిగిపోయింది.

మహాభారతంలోని విరాటపర్వం అనేది ఓ కీలక ఘట్టం.. అలాంటి టైటిల్ ఈ సినిమాకి పెట్టడానికి గల కారణం?

ఆ మహా ఘట్టానికి ఈ సినిమా కథకి అసలు సంబంధమే లేదు. మహాభారతంలోని విరాటపర్వం ఒక హిడెన్ స్టోరీ, అందులో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు అన్నీ అండర్ కరెంట్ గా హిడెన్ గా జరుగుతుంటాయి. అలాంటి అంశాలే ఈ కథలో కూడా కంప్లీట్ హిడెన్ ఫార్మాట్ లో ఉంటాయి. అందుకే నేను ‘విరాటపర్వం’ అని పెట్టాను. సినిమాలో ఎక్కడా విరాటపర్వం అనే డైలాగ్ కూడా ఉండదు.

అసలు ‘విరాటపర్వం’ కథేంటి?

ఫస్ట్ ఇది 1990లో జరిగే కథ.. “ప్రపంచంలో వచ్చిన అన్ని ఉద్యమాల్ని, రాజకీయాల్ని, మతాల్ని, కులాల్ని, అనేక వైరుధ్యాల్ని తరతరాలుగా ప్రేమ ప్రశ్నిస్తూనే ఉంది.. ప్రేమ నిలదీస్తూనే ఉంది.. అలా ప్రశ్నించి? నిలదీసిన ఓ అమ్మాయి కథే విరాటపర్వం”. ఫైనల్ గా ఈ విశ్వంలో ప్రేమ అనేది అన్నిటికన్నా అల్టిమేట్ అని చెప్పడమే ఈ కథలోని కీ పాయింట్.

అంటే కథ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుందా?

నేను అసలు ఈ హీరో సెంట్రిక్, హీరోయిన్ సెంట్రిక్ అనే వాటిని నమ్మను. నేను ఓ కథ చెబుతాను, అందులో బలమైన పాత్రలు ఉంటాయి, ఆ పాత్రల మధ్య సంఘర్షణలతో కథని నడిపిస్తాయి అనేదే నమ్ముతాను. కాబట్టి నేను అలా చెప్పలేను.

అప్పటికే బాహుబలితో సూపర్ ఇమేజ్ ఉన్న రానా గారు సెట్లో ఎలా ఉంటారు?

రానా గారికి ఇమేజ్, స్టార్డం లాంటి ఏముండవు.. రానా సెట్లో ఒక ఎల్.కె.జి పిల్లాడిలా ఉంటాడు. ఒక టీచర్ ముందు ఎల్.కె.జి స్టూడెంట్ ఎంత వినయంగా ఉంటూ ప్రతిదీ వింటుంటాడో అలా డైరెక్టర్ కి కంప్లీట్ గా సరెండర్ అయిపోతాడు. భాష మీద, సినిమా క్రాఫ్ట్స్ మీద మంచి కమాండ్ ఉన్న స్టార్. హీ ఈజ్ ఆల్ రౌండర్ అండ్ హీ ఈజ్ గ్రేట్ భయ్.. గ్రేట్ అంతే..

సాయి పల్లవి అంటే కాంట్రవర్సీ కి కేరాఫ్ అంటుంటారు.. మరి మీ ఎక్స్పీఎరియన్స్ ఏంటి?

‘నీది నాది ఒకే కథ’లో కూడా సాయి పల్లవి చేయాలి. కానీ అప్పట్లో ఆవిడ స్టడీస్ వల్ల కుదర్లేదు. అప్పుడే డిసైడ్ అయ్యా సెకండ్ సినిమా ఏం చేసిన హీరోయిన్ సాయి పల్లవి అనే.. ఆవిడ నటన అంటే అంతలా ఇష్టం. సాయి పల్లవి ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అండి. బయట ఆవిడ గురించి వాళ్ళతో, వీళ్ళతో గొడవలు పెట్టుకుంటుందని పిచ్చి పిచ్చి ఆర్టికల్స్ వస్తుంటాయి. అవి నిజం కాదు.. ఆవిడ కథ కోసం, పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. లాంగ్వేజ్ కొంచం ప్రాబ్లెమ్, అలాగే రైటింగ్ ఐడియా ఉంది. అందుకే ఎక్కువ డౌట్స్ లాజిక్స్ అడుగుతూ ఉంటుంది. అవి చెప్పగలిగితే ఇష్యూ ఉండదు. నేను లైవ్ లో చూసాను కదా.. ఆవిడ బిహేవియర్, క్యారెక్టర్, సూపర్బ్.. ఒక్క మాటలో చెప్పాలంటే షీ ఈజ్ మాగ్నెట్.. ఒకసారి వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే యాక్టర్.

మొదటి సినిమా పరంగా చూసుకుంటే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు, బడ్జెట్ పెరిగింది.. సో డైరెక్టర్ గా మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు?

ఒక మాట చెప్తాను.. హార్డ్ గా ఉండచ్చు బట్ అది నా నైజం.. ‘ఐ రెస్పెక్ట్ స్టార్స్, బట్ ఐ డోంట్ కేర్ అబౌట్ స్టార్డం’.. నేను కథని మాత్రమే నమ్ముతా, నా కథ ఏది అడిగితే అదే చేస్తా.. అందుకే సెట్లో కూడా వాళ్ళని నా పాత్రల్లాగే చూసాను, ఆ షాట్ లో చెప్పాల్సిన కథని కరెక్ట్ గా చెప్తున్నాను అనేది మాత్రమే చూస్తాను. కాబట్టి స్టార్స్ వల్ల ఇబ్బంది పడలేదు. ఛాలెంజ్ కాదు గానీ హ్యాపీగా అనిపించింది మాత్రం, ఇప్పటికి ఒక 68 డేస్ షూట్ చేసాం, ఇంకో 10 డేస్ చేస్తే షూట్ అయిపోద్ది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి భారీ సినిమాని అన్ని రోజుల్లో తీయడం మంచి ఫీల్ ఇచ్చింది. ఛాలెంజ్ అంటే సెట్లో ఎక్కువ మంది ఉండే వారు వీలైతే తక్కువ మందితో చేస్తే బాగుంటుంది కదా అనిపించేది.

ప్రియమణి, నందిత దాస్ ఇలా స్టార్ వాల్యూ పెరుగుతూనే ఉంది. వీళ్ళందరూ కథ రాసుకునేప్పుడే ఉన్నారా? వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా?

రానా గారి ఇమేజ్ ప్రకారం ఇది పాన్ ఇండియా ఫిల్మ్ గా రిలీజ్ అవుతుంది. అలా అని ఇంత మంది స్టార్స్ రాలేదు. నేను కథ రాసుకునేటప్పుడే ఈ పాత్రలకి వీళ్ళని రాసుకున్నా. కథలోకి అనుకోకుండా వచ్చింది రానా, నందిత దాస్ గారు మాత్రమే. ముందుగా నందిత దాస్ గారి పాత్ర కోసం టబు గారిని అనుకున్నా కానీ ఆ టైములో ఖాళీ లేక ఆవిడ చేయలేకపోయారు. ఇంకా సప్సెన్స్ స్టార్స్ అంటే నవీన్ చంద్ర కూడా ఓ నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు. ప్రియమణి, నవీన్ చంద్ర కాంబినేషన్ సీన్స్, సెకండాఫ్ లో ఆ పాత్రలు కథని మలుపు తిప్పే విధానం, ఆ తర్వాత కథ వెళ్లే విధానాం మైండ్ బ్లోయింగ్ గా అనేలా ఉంటుంది. ఒక షేక్ స్పియర్ కథల్లో ఉండే ఇంటెన్స్ అండ్ డెప్త్ ఉంటుంది. అలాగే సినిమా చూసేటప్పుడు ఏ పాత్ర చూసినా వారి స్టార్డం కనపడదు, వారి పాత్రలే కనపడతాయి. అంతలా ఒదిగిపోయి వారు కూడా చేశారు. రైటర్ గా, డైరెక్టర్ గా ఈ విషయంలో హై మార్క్స్ స్కోర్ చేస్తాను.

డిఓపి, ఫైట్స్ మాస్టర్స్ ని హాలీవుడ్ వారిని తీసుకోవడానికి గల కారణం?

డిఓపి డానీ అయితే బాగుంటారని రానా సజెస్ట్ చేసారు. సూపర్బ్ అవుట్ ఫుట్ ఇచ్చారు. ఇక యాక్షన్ అంటే ఏదో ఒకరు 100 మందిని కొట్టడం లాంటివి కాదు, అన్నీ కథలో భాగంగా వస్తాయి. నక్సల్ ఫైరింగ్, యుద్ధ పోరాటాలు చాలా నాచురల్ గా ఉండాలి. ఎవరైతే బెటరా అని చూస్తున్న టైంలో యూరి చూసి బాగా నచ్చి వారిని సజెస్ట్ చేసాను. వాళ్ళు వెంటనే ఆయన్ని తీసుకొచ్చారు.

విరాటపర్వం గ్యాప్ లో ఓ వె సీరీస్ స్టార్ట్ చేశారని, మధ్యలో ఆపేయడం వలన అల్లు అరవింద్ గారితో గొడవలు నడుస్తున్నాయని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంత?

ఇవన్నీ రూమర్స్ అండీ.. నిజం ఏమిటంటే.. అల్లు అరవింద్ గారి ఆహా కోసం వెబ్ సీరీస్ లు చేస్తానని కమిట్ అయ్యాను. వారి కోసం గుడిపాటి వెంకటచలం గారి పుస్తకాల్ని ఒక రెండు మూడు వెబ్ సీరీస్ కథలుగా తయారు చేస్తున్నాను. ఈ వెబ్ సీరీస్ లకి నేను రైటర్ గా, నిర్మాతగా, షో రన్నర్ గా మాత్రమే ఉంటాను. ప్రస్తుతానికి దానికి డైరెక్టర్ ఎవరు అనేది ఫిక్స్ కాలేదు. కుదిరితే నేను ఒక సీరీస్ చేయచ్చు లేదా చేయకపోవచ్చు కూడా ఎందుకంటే వెంటనే ఓ బిగ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి.

ఈ క్వారంటైన్ టైంలో ఆ కథలతోనే కాలక్షేపం చేస్తున్నారా?

హా అవునండి.. ఓ బిగ్ ప్రొడక్షన్ లో ఓ పెద్ద హీరోతోనే ‘విరాటపర్వం’ అయిన వెంటనే సినిమా ఉంటుంది. ఆ కథని పక్కాగా రెడీ చేసే పనిలో ఉన్నాను. ఆ కథ 1980-90లో జరుగుతుంది. చంద్రబాబు నాయుడుగారు రూలింగ్ లో ఉన్న టైంలో జరుగుతుంది. అలా అని పొలిటికల్ కథ కాదు. ఆయన రూలింగ్ లో ఉన్న టైంలో జరిగిన ఓ క్రైమ్ ఎలిమెంట్ కి నా కథలోని పాత్రల ఎమోషన్స్ మధ్య జరిగే ఓ యూనిక్ కథ అది. అలా వె సీరీస్ పీ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది.

మీ డ్రీం ప్రాజెక్ట్ ఏంటి?

చెప్పాలంటే ‘విరాటపర్వం’ నా డ్రీం ప్రాజెక్ట్.. నా రెండవ సినిమాగా ఇదవుతుందని అనుకోలేదు. కానీ అలా కుదిరేసింది. ఇక నుంచి ప్రతి సినిమా నా డ్రీం ప్రాజెక్ట్ అనుకోవాల్సిందే..


Advertisement

Recent Random Post:

Aghori Naga Sadhu : అఘోరి అలజడి

Posted : November 2, 2024 at 5:55 pm IST by ManaTeluguMovies

Aghori Naga Sadhu : అఘోరి అలజడి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad