డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో నిరాశ పర్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కాకుండా విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఆమద్య కొన్ని సినిమాలు చర్చల్లోకి వచ్చినా కూడా అవి ఇప్పట్లో తెరకెక్కే అవకాశాలు కనిపించడం లేదు. భారీ ఎత్తున అంచనాలున్న పూరి మూవీ విడుదలైన తర్వాతే కొత్త సినిమా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాని విజయ్ ఆలోచిస్తున్నాడట.
ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో చాలా మంది హీరోలు కథలు వినడం కొత్త సినిమాలకు ఓకే చెప్పడం చేస్తున్నారు. కాని విజయ్ దేవరకొండ మాత్రం పెద్దగా కొత్త కథలు విన్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ప్రముఖ స్టార్ డైరెక్టర్స్ ఈయన్ను డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాని ఈయన మాత్రం ప్రస్తుతానికి మౌనమే పాటిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడంపై ఈయన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో గీత గోవిందం, అర్జున్ రెడ్డి చిత్రాలు మంచి హిట్‌గా నిలిచాయి. మిగిలిన సినిమాలు యావరేజ్‌గా కొన్ని ప్లాఫ్‌గా నిలిచాయి. ఈసారి పూరితో చేయబోతున్న సినిమా ఖచ్చితంగా హిట్‌గా నిలవాలి. అప్పుడే రౌడీ స్టార్ క్రేజ్ మళ్లీ పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.