Advertisement

ఎఫ్‌ 3లో సూపర్‌ స్టార్‌ స్పెషల్‌

Posted : May 11, 2020 at 11:17 pm IST by ManaTeluguMovies

గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్‌ 2 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో అప్పుడే ఎఫ్‌ 3 ఉంటుందని నిర్మాత దిల్‌రాజు మరియు దర్శకుడు అనీల్‌ రావిపూడి ప్రకటన చేసిన విషయం తెల్సిందే. కరోనా లేకుంటే ఈ ఏడాదిలో ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నాడు. కాని ఇప్పట్లో సినిమా ప్రారంభం అయ్యే పరిస్థితి లేదు.

రెండు నెలలు తన టీంతో కూర్చుని ఎఫ్‌ 3 స్క్రిప్ట్‌ను అనీల్‌ రావిపూడి రెడీ చేశాడు. కొన్ని రోజుల క్రితం ఫస్ట్‌ హాఫ్‌ వరకు పూర్తి అయ్యిందంటూ ప్రకటించిన అనీల్‌ రావిపూడి తాజాగా మొత్తం స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడట. ఫస్ట్‌హాఫ్‌లో మూడవ హీరోకు స్కోప్‌ లేదన్న అనీల్‌ రావిపూడి సెకండ్‌ హాఫ్‌కు వచ్చేప్పటికి థర్డ్‌ హీరో గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడట.

ఆ గెస్ట్‌ రోల్‌ కోసం మహేష్‌బాబును సంప్రదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనీల్‌ రావిపూడికి మహేష్‌బాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఎఫ్‌ 3 కి రంగంలోకి ఆయన్ను దించే అవకాశాలున్నాయి. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి అనీల్‌ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎఫ్‌ 3లో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లతో పాటు మహేష్‌ బాబు కూడా ఉంటే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయే అవకాశం ఉంది. మరి మహేష్‌ ఈ గెస్ట్‌ రోల్‌కు ఓకే చెప్తాడా చూడాలి.


Advertisement

Recent Random Post:

సీఎం బస్సు యాత్రకు ఇవాళ విరామం | CM YS Jagan Bus Yatra

Posted : April 22, 2024 at 11:34 am IST by ManaTeluguMovies

సీఎం బస్సు యాత్రకు ఇవాళ విరామం | CM YS Jagan Bus Yatra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement