Advertisement

ఈ సినిమాతో నాకు రెస్పెక్ట్ వస్తుంది: బండ్ల గణేష్

Posted : February 4, 2022 at 7:02 pm IST by ManaTeluguMovies

క్యారెక్టర్ నటుడిగా ఎప్పటినుండో టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు బండ్ల గణేష్. అయితే ఎప్పుడూ కూడా బిజీ నటుడు, మంచి పాత్రలు చేస్తాడు అన్న పేరు తెచ్చుకోలేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన బండ్ల గణేష్ కు తనకంటూ పేరు వచ్చిన చిత్రాలు చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో డేగల బాబ్జి కథ తన వద్దకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని ఎవరైనా మంచి హీరోతో చేద్దామని తన స్నేహితుడు వెంకట్ చంద్రకు చెప్పానని అన్నాడు. అయితే తన మిత్రుడు మాత్రం ఈ చిత్రంలో నువ్వే నటించాలి అని పట్టుబట్టి నా చేత చేయించాడని తెలిపాడు.

అసలు ఈ రోల్ తాను చేయగలనా లేదా అనే అనుమానం ఉండేదని, కానీ ఇటీవలే ఫైనల్ రషెస్ చూసాక ఆశ్చర్యపోయానని, నేనేనా ఇంతలా చేసింది అనేంతలా ఉన్నాయని అన్నాడు. డేగల బాబ్జితో నటుడిగా తనకు రెస్పెక్ట్ వస్తుందని తెలిపాడు బండ్ల గణేష్.


Advertisement

Recent Random Post:

ఫస్ట్ నేమ్.. | BJP MP Purandeswari SENSATIONAL REACTION On Lok Sabha Deputy Speaker |

Posted : June 26, 2024 at 2:31 pm IST by ManaTeluguMovies

ఫస్ట్ నేమ్.. | BJP MP Purandeswari SENSATIONAL REACTION On Lok Sabha Deputy Speaker |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement